Home » ఎం జగన్ బాటలోనే అల్లు అరవింద్… సినిమా టికెట్స్ రేట్లు తగ్గించాలి..!

ఎం జగన్ బాటలోనే అల్లు అరవింద్… సినిమా టికెట్స్ రేట్లు తగ్గించాలి..!

by Azhar
Ad

కరోనా సమయం తర్వాత ముఖ్యంగా ఇప్పుడు విడుదల అవుతున్న సినిమా టికెలా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెద్ద సినిమాలు అన్ని 400 కంటే ఎక్కువ టికెట్ ధరతోనే విడుదల అవుతున్నాయి. దాంతో అభిమానులు టికెట్ రేట్స్ తగ్గించాలని అని అంటున్న ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో తియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుంది. ఎలాగూ సినిమా వచ్చిన రెండు మూడు వారాలకు ఓటీటీలో వస్తుంది కదా అనే ఆలోచనతో ఉంటున్నారు ప్రజలు.

Advertisement

అయితే ఈ మూడో లాక్ డౌన్ తర్వాత తియేటర్లు ఓపెన్ కావడంతో సినిమాలు తియేటర్లకు క్యూ కట్టాయి. కానీ అప్పుడే సీఎం జగన్.. ఏపీలో సినిమా టికెట్లా రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం విధించిన ధరలకే రేట్స్ ఉండాలి అని పేర్కొన్నారు. కొన్ని సినిమాలు అదే ధరకు వచ్చిన ఆ తర్వాత… సినిమా ప్రముఖులు పలుమార్లు జగన్ ను కలిసి.. మాట్లాడి.. రేట్లను పెంచేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ధనతో పెద్ద సినిమాలకు మొదట కొన్ని రోజులు టికెట్ల ధర పెంచుకునే అవకాశాని జగన్ కల్పించారు.

Advertisement

కానీ తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా సీఎం జగన్ బాటలోనే సినిమా టికెట్స్ రేట్లు తగ్గించాలి అని కామెంట్స్ చేసారు. తాజాగా ఆయన బ్యానర్ లో విడుదలవుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా టికెట్ల రేట్లను తగ్గించాలి. అలాగే ఓటీటీలో త్వరగా విడుదల చేయకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాని మనం ఇప్పుడు చూస్తున్నం. కాబట్టి అభిమానులు తియేటర్లకు వచ్చి సినిమాలు చూసే విధంగా రేట్లను తగ్గించాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి :

ధోని ఓ ఎమోషన్స్ లెస్ పర్సన్..

సిరాజ్ ను అవమానించారు.. అంపైర్లు కూడా ఏం మాట్లాడలేదు.. నాకు కోపం వచ్చి..?

Visitors Are Also Reading