టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుల్లో మహి వి.రాఘవ్ ఒకరు. ఇతనికీ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. యాత్ర, యాత్ర 2 సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఇతనికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం ఇచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మహి వి రాఘవ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని మహి వి రాఘవ్ పేర్కొన్నారు.
వీటిని చదవండి: మొదటి భార్యకు అందుకే విడాకులు ఇచ్చాను.. నటుడు సురేష్ కామెంట్స్ వైరల్..!
Advertisement
వీటిని చదవండి: చిరంజీవి సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ దర్శకుడు ఎవరో తెలుసా ?
Advertisement
రాయలసీమ కోసం నా వంతు ఏమైనా చేయాలనే ఆలోచనతో రెండు ఎకరాల భూమిలో మినీ స్టూడియోని నిర్మించాలని అనుకున్నానని మహి వి.రాఘవ్ కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాయలసీమలో షూటింగ్ లు చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించారని మహి వి.రాఘవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని మహి వి. రాఘవ్ చెప్పుకొచ్చారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఎక్కడెక్కడో భూములు ఇచ్చారని ఆ భూముల గురించి మాత్రం ఎవ్వరూ కామెంట్ చేయరని మహి వి. రాఘవ్ వెల్లడించడం గమనార్హం.
నా ప్రాంతానికి ఏదో చేయాలని ఆశయం లేకపోతే నేను ఇతర ప్రాంతాల్లో స్థలం అడిగేవాడినని మహి వి. రాఘవ్ చెప్పుకొచ్చారు. నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయడానికి ఎవ్వరూ ఇస్టపడరని మహి రాఘవ్ చెప్పుకొచ్చారు. నేను రాయలసీమలో తీసిన మూడు ప్రాజెక్టు కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశానని ఆయన కామెంట్స్ చేశారు. రెండు ఎకరాలలో మాత్రమే స్టూడియో నిర్మిస్తున్నాని మహి వి. రాఘవ్ చెప్పుకొచ్చారు.
వీటిని చదవండి: ఏపీ ప్రభుత్వం పై జబర్దస్త్ రోహిణి సెటైర్స్.. అందుకోసమేనా..?