Home » అల్లరి నరేష్ కు ఆ ఒక్కటే మైనస్ పాయింట్..అందుకే మూవీస్ ప్లాప్..!!

అల్లరి నరేష్ కు ఆ ఒక్కటే మైనస్ పాయింట్..అందుకే మూవీస్ ప్లాప్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత జనరేషన్ లో ఉన్నటువంటి కామెడీ హీరోలలో స్టార్ హీరోగా పేరు పొందారు అల్లరి నరేష్. ఆయన తెరపై కనిపించారు అంటే తప్పనిసరిగా నవ్వురాక మానదు. అలాంటి అల్లరి నరేష్ ఇప్పటికే ఎన్నో కామెడీ చిత్రాలు చేసి సూపర్ హిట్ సాధించారు. అలాంటి నరేష్ గత కొంతకాలంగా ఫెయిల్యూర్ బాట పడుతున్నారు. దీనికి కారణాలేంటి అనే విషయాలు ఒక ఇంటర్వ్యూ లో ఈ మంది రామారావు బయటపెట్టారు. అల్లరి నరేష్ 1982 జూన్ 30న ఏపీలోని కోరుమామిడిలో జన్మించారు. ఈయన ఇవివి సత్యనారాయణ రెండవ కొడుకు. అల్లరి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులకు అల్లరి నరేష్ గా పరిచయమయ్యారు..

Advertisement

also read:యముడికి మొగుడు సినిమా లాసులను చిరంజీవి ఎందుకు భరించారు…?

Advertisement

అత్యధిక హాస్యాన్ని పండించే చిత్రాలలో తన నటన అభినయంతో వీరోచితమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఆయన ఇప్పటికే 50 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.. అలాంటి అల్లరి నరేష్ చెన్నైకి చెందినటువంటి విరూపాను వివాహమాడారు. అయితే అల్లరి నరేష్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఈ మధ్యకాలంలో కాస్త క్రేజ్ తగ్గింది.. అంతేకాకుండా కథల ఎంపికలో దర్శకనిర్మాతలు మరియు నరేష్ ఫెయిల్ అవుతున్నారని ఇది ప్రధానమైన మైనస్ గా చెప్పొచ్చని సీనియర్ సినీ జర్నలిస్ట్ ఈ మంది రామారావు అంటున్నారు. అలనాటి రాజేంద్రప్రసాద్ స్థాయిలో కామెడీ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ తన తండ్రి చనిపోవడం కూడా అతిపెద్ద మైనస్ గా చెప్పవచ్చు..

అల్లరి నరేష్ సత్యనారాయణ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఇండస్ట్రీలోనే బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. అల్లరి నరేష్ కామెడీ పాత్రలే కాకుండా సీరియస్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించే సామర్థ్యం గల హీరో.. ఏది ఏమైనా నరేష్ కథల ఎంపికలో కాస్త దృష్టి పెడితే మళ్లీ సక్సెస్ బాటలో దూసుకుపోయే అవకాశం ఉందని ఈ మంది రామారావు అంటున్నారు. ప్రస్తుత ప్రేక్షకుల ఆలోచన విధానానికి తగిన కథ ఎంచుకొని ముందుకు వెళ్లలని అభిమానులు కూడా కోరుతున్నారు. మరి ఇకముందు అయినా అల్లరి నరేష్ ఈ విషయంలో ముందుకెళ్తారో లేదో చూడాలి..

also read:

Visitors Are Also Reading