భారత క్రికెట్ జట్టు ఇవాళ వెస్టిండిస్ తో మ్యాచ్ ముగించుకుని.. ఆ తరువాత శ్రీలంకతో టీ-20, టెస్ట్ సిరీస్‌లలో తలపడనుంది. ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంకతో జరుగనున్న టీ-20, టెస్ట్ సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. అత్యంత షాకింగ్ అయిన విషయమేమిటంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరబ్ కుమార్‌ను భారత టెస్ట్ జట్టులోకి ఆహ్వానించడం. ఇరవై ఎనిమిది ఏళ్ల సౌరబ్ కుమార్ లెప్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ను బీసీసీఐ టెస్ట్ జట్టులోకి ఆహ్వానించింది.
Also Read : హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఏమన్నారంటే..?
Advertisement
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో సౌరబ్ ను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సౌరబ్ బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. 2021వేలంలో సౌరబ్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. బాగ్‌పత్‌లో నివాసం ఉండే సౌరబ్‌కు మొదటి నుంచి సర్వెసెస్‌కు అవకాశం లభించింది.భారతదేశ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సుపరిచితమైన పేరు సౌరబ్ కుమార్. 2014 హిమాచల్ ప్రదేశ్‌తో సర్వీసెస్ తరుపున తన తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.
Advertisement
తరువాత తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేవ్ తరుపున ఆడడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి 196 వికెట్లు, రెండు సెంచరీలు కూడా చేశాడు. ఇందులో 24.15 సగటు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 16 సార్లు ఐదు వికెట్లు, ఒక మ్యాచ్‌లో 6 సార్లు 10 వికెట్లు తీశాడు. బ్యాట్స్‌మెన్‌గా అతను 29.11 సగటుతో 1572 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. మరొకవైపు దక్షిణాఫ్రికా పర్యనటకు భారత్-ఏ జట్టులో సౌరభ్‌కుమార్ భాగమయ్యాడు. అక్కడ మాత్రం అతను రాణించలేకపోయాడు. రెండు అనధికార టెస్టుల్లో నాలుఉగ వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Also Read : జర్నలిస్ట్ నుంచి వృద్ధిమాన్ సాహాకు బెదిరింపులు.. స్క్రీన్ షాట్ షేర్..!