తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే అనే సామెత రాజకీయాలకు చక్కగా వర్తిస్తుంది. సొంత అన్నదమ్ములు కూడా ఒకరిపై ఒకరు పోటీకి దిగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా సినీ నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలీ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలీ వైసీపీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్నారు.
Advertisement
చాలాకాలం నుండి ఆలీ వైసీపీలో నేతగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యే… ఎంపీ టికెట్ లను సైతం ఆలీ ఆశించారు. అయితే జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ ఆలీకి సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే.
Advertisement
దాంతో ఆలీ జనసేనలో కొనసాగాలని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు కోరుకున్నారు. కానీ ఆలి మాత్రం వైసీపీని వీడకుండా అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే తాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమని చెప్పారు. దాంతో ప్రస్తుతం ఆలి చేసిన కామెంట్ లు హాట్ టాపిక్ గా మారాయి. మరి వైసీపీ అధిష్టానం పవన్ పై పోటీ కి ఆలీకి టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
Also read : వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?