బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ మూవీ ‘మిషన్ రాణిగంజ్’. 1989లో పశ్చిమ బెంగాల్ రాణిగంజ్ బొగ్గు గనుల్లో దాదాపు 65 మంది చిక్కుకుపోయారు. వారందరినీ కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ జస్వంత్ సింగ్ పాత్రని పోషించాడు. అక్టోబర్ 6న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో పెద్దగా సత్తా చాటలేకపోతుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్స్ కి వెళ్ళడానికి సిద్దమయ్యినట్లు బి-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
RRR సినిమాతో రాజమౌళి ఇక్కడ నిర్మాతలకు ఒక కొత్త దారి చూపించాడు. ఒకప్పుడు ఆస్కార్ కి వెళ్లాలంటే ప్రభుత్వం అధికారికంగా పంపించాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు అన్నట్లు ఉండేది. కానీ రాజమౌళి RRR ని ఇండిపెండెంట్ గా ఆస్కార్ కి తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు ఇదే దారిని మిషన్ రాణిగంజ్ మూవీ టీం కూడా అనుసరిస్తుందట. ఆల్రెడీ ఈ సినిమాని ఆస్కార్స్ కి సబ్మిట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ప్రభుత్వం తరుపు నుంచి ఆస్కార్స్‌కి.. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘2018’ని పంపించారు.
Advertisement
ఇక ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’ స్క్రిప్ట్ ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ మూవీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలియజేశాడు. ఇప్పుడు ఆస్కార్స్ కి వెళ్లిన 2018, మిషన్ రాణిగంజ్.. రెండు సినిమాలు సర్వైవల్ డ్రామాలు. రెండు చిత్రాలు గతంలో వచ్చిన విపత్తులు పై తెరకెక్కిన సినిమాలే. మరి ఈ ఏడాది ఆస్కార్ ని ఈ సినిమాలు దక్కించుకుంటాయా లేదా అనేది చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!