Home » Akkineni Nagarjuna : అప్పుల్లో కూరుకుపోయిన అన్నపూర్ణ స్టూడియో..?

Akkineni Nagarjuna : అప్పుల్లో కూరుకుపోయిన అన్నపూర్ణ స్టూడియో..?

by Bunty
Ad

 

 

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అంది పుచ్చుకొని… అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోంది. అక్కినేని నాగార్జున తో పాటు ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ అక్కినేని నాగార్జున అంత సక్సెస్…. ఆయన కుమారులు కాలేకపోయారు.

Akkineni Venkat about Latest Movies in Annapurna Studios

అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఇది ఇలా ఉండగా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియో అప్పుల్లో కూరుకు పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున సోదరులు, అక్కినేని నాగేశ్వరావు పెద్ద కుమారుడు వెంకట్ తెలిపారు. అక్కినేని నాగార్జున సినిమా హీరో కావాలని… తాను ఆకాంక్షించినట్లు వెంకట్ వివరించారు. అయితే ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలను తానే చేసుకునేవాడిని అని చెప్పారు.

Advertisement

Advertisement

అయితే.. కొన్ని కారణాల వల్ల.. తాను అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాల బాధ్యతను తప్పుకున్నానని…ఆ తర్వాత అక్కినేని నాగార్జున ఆ బాధ్యతలు తీసుకున్నారని వెల్లడించారు. అయితే.. గతంలో అన్నపూర్ణ స్టూడియో అప్పుల్లో కూరుకుపోయిందని…వెంకట్‌ చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా.. సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బును అన్నపూర్ణ స్టూడియోలో పెట్టి… దానిని నాగార్జున కాపాడాడని వివరించారు వెంకట్‌. ఇప్పుడు ఈ విషయం హాట్‌ టాపిక్‌ గా మారింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading