Home » అక్కినేని నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా ఉండ‌టానికి కార‌ణం అదేనా?

అక్కినేని నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా ఉండ‌టానికి కార‌ణం అదేనా?

by Bunty
Ad

అక్కినేని నాగ చైత‌న్య విడుకుల త‌ర్వాత నుంచి ట్విట్ట‌ర్ లో బాగా యాక్టివ్ గా క‌నిపిస్తున్నాడు. త‌న సినిమా ల ప్ర‌మోష‌న్ కు అలాగే ఇత‌ర హీరోల సినిమా ల పై కామెంట్ చేయ‌డం వంటివి ఈ మ‌ధ్య కాలం లో అక్కినేని నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ అకౌంట్ లో ఎక్కువ గా క‌నిపిస్తున్నాయి. అయితే స‌మంత నుంచి నాగ చైత‌న్య విడాకులు తీసుకోక ముందు.. నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ లో ఇంత యాక్టివ్ గా లేడ‌నే చేప్పాలి. గ‌త కొద్ది రోజుల నుంచే నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా క‌నిపిస్తున్నాడు.

Advertisement

Advertisement

అయితే త‌న సినిమా ల ను ప్ర‌మెట్ చేయ‌డా ని కి సోషల్ మీడియా నే స‌రి అయిన ప్లాట్ ఫామ్ అని భావించి.. యాక్టివ్ గా ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే కొంత మంది మాత్రం వేరేలా కామెంట్ చేస్తున్నారు. స‌మంత కూడా విడాకులు తీసుకున్న నాటి నుంచి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే వ‌రుస పెట్టి సినిమా ల కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. ఇప్ప‌టి కే ఒక హాలీవుడ్ క‌థ కు, అలాగే పాన్ ఇండియా లెవ‌ల్ సినిమా కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇలా సోష‌ల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటం.. వ‌రుస పెట్టి సినిమా లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం.. త‌న జీవితం సాఫీ గా సాగుతుంద‌ని సింబాలిక్ గా చెబుతుంద‌ని పలువురు అంటున్నారు.

అలాగే నాగ చైత‌న్య కూడా త‌న జీవితం సాఫీ గా సాగుతుంద‌ని.. చెప్పాడాని కే సోష‌ల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నాడ‌ని ప‌లువురు చెబుత‌న్నారు. అయితే అక్కినేని నాగ చైత‌న్య చేసిన రెండు సినిమా లు విడుద‌ల కు సిద్ధం గా ఉన్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వరి లో బంగార్రాజు విడుద‌ల అవ‌బోతుంది. అలాగే థాంక్యూ అనే సినిమా కూడా విడుద‌ల కు సిద్ధం గా ఉంది. వీటి తో పాటు బాలీవుడ్ లో న‌టించిన లాల్ సింగ్ చ‌ద్ధా అనే సినిమా ఏప్రిల్ 14 న విడుద‌ల కానుంది.

Visitors Are Also Reading