సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాలో పాత్ర ఒకరి కోసం రాసుకుంటే దానిని మరొకరు చేస్తుండటం సర్వసాధారణం అయింది. చాలామంది సెలబ్రిటీలు ఇలా మంచి మంచి స్టోరీస్ ను మిస్ చేసుకున్న వాళ్ళను చూశాం. అయితే రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా అలాంటి మంచి పాత్రను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతా మంచి అవకాశం ఎలా మిస్ అయిపోయావు అంటూ బాధపడుతున్నారు. వాస్తవానికి నిహారిక పుట్టగానే ఒక పెద్ద ప్రాజెక్టులో భాగం కావాల్సి ఉందట. నిహారిక పుట్టిన తర్వాత సిసింద్రీ సినిమా షూట్ ను ప్రారంభించారు. ఈ సినిమా సమయంలో చిత్ర యూనిట్ ఒక పాప గాని బాబు గాని పాకుతూ ఉండే స్టేజ్ లో బేబీ కావాలి అంటూ బాగా ఎక్కువగా ట్రై చేశారట.
Advertisement
Advertisement
స్టార్ సెలబ్రిటీల పిల్లలు అయితే సినిమాకి మరింత హైప్ వస్తుందని అలాంటి వారి కోసం ట్రై చేశారట. అప్పటికే నిహారికకు 8 నెలలు దాటిపోయాయి. జనరల్ గా ఎనిమిది నెలలు దాటేసరికి పిల్లలు పాకుతూ ఉంటారు. కానీ నిహారిక చాలా యాక్టివ్ గా ఉండేదట. ఎనిమిది నెలలకు గోడ పట్టుకొని ఏకంగా నడిచేసేదట. అయితే సిసింద్రీ సినిమాకి అంత యాక్టివ్ గా ఉండే పిల్లలు వద్దని పాకుతూ ఉండే బేబీ కోసం ట్రై చేశారట. ఇక అప్పుడే అక్కినేని నాగార్జునకు అఖిల్ పుట్టడం, అఖిల్ ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోవడంతో మేకర్స్ అఖిల్ ను ఎంచుకున్నారట. అలా సిసింద్రీ సినిమా నిహారిక నుంచి అఖిల్ ఖాతాలోకి వెళ్లిపోయింది.ఒకవేళ నిజంగానే నిహారిక చిన్నప్పుడు ఆ పాత్రలో కనిపించి ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేది అని కొందరు అభిమానులు భావిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!