అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.
Advertisement
విడుదలైన రోజు నుంచి ఏజెంట్ కి ఫ్లాప్ టాక్ రావటంతో రెండో రోజు నుంచి జనాలు థియేటర్ కి వెళ్లడం మానేశారు. గత సినిమాలతో పోల్చితే అఖిల్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించిన కథలో ఎలాంటి ఎమోషన్ లేకపోవడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం ఈ మూవీని సేవ్ చేయలేకపోయాడు. కాగా, ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం కేవలం 6.50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.
Advertisement
READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్
నిన్నటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో రన్ క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ కి 30 కోట్ల రూపాయలకు పైగా నష్టం అన్నమాట. అందరూ తీవ్రంగా నష్టపోవడంతో బయ్యర్స్ నిర్మాతని నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అఖిల్ ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ లో 75% తిరిగి నిర్మాతకు ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఆయన సుమారుగా 15 నుండి 20 కోట్ల రూపాయల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.
READ ALSO : ‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?