Home » కార్తీకేయ‌ను బ్రో అని పిలిచిన అఖిల్…కానీ అత‌డి రిప్లై చూసి మండిప‌డుతున్న అఖిల్ ఫ్యాన్స్..!

కార్తీకేయ‌ను బ్రో అని పిలిచిన అఖిల్…కానీ అత‌డి రిప్లై చూసి మండిప‌డుతున్న అఖిల్ ఫ్యాన్స్..!

by AJAY
Ad

చరిత్ర‌లో మొట్ట‌మొద‌టిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాట ఆస్కార్ ను గెలుచుకుంది. ఇక తెలుగు సినిమాకు ఆస్కార్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. దాంతో దేశ ప్ర‌ధాని నుండి రాజ‌కీయ‌నాయ‌కులు మ‌రియు సినీతార‌లు ఆస్కార్ టీమ్ ను అందులోని స‌భ్యుల‌ను అభినందిస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శంస‌లు కురిపించారు.

ALSO READ : రెండో పెళ్లికి రెడీ అవుతున్న సింగ‌ర్ కౌస‌ల్య‌…వ‌రుడు ఎవ‌రో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Advertisement

ఈ నేప‌థ్యంలో అక్కినేని వార‌సుడు అఖిల్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర‌యూనిట్ కు అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ లో అఖిల్ రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ పేరును ముందుగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేయ‌డం విశేషం. అఖిల్ త‌న ట్వీట్ లో…అతిపెద్ద ఘ‌న‌త సాధించినందుకు మై బ్ర‌ద‌ర్ కార్తికేయ‌కు బిగ్ షౌటౌట్…ఆ త‌ర‌వాత మిగ‌తావాళ్ల పేర్లు రాసుకువ‌చ్చాడు.

Advertisement

ఇక అఖిల్ చేసిన ట్వీట్ ను కార్తికేయ రీట్వీట్ చేశాడు. అంతే కాకుండా థాంక్యూ రా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక కార్తికేయ రిప్లై చూసి అఖిల్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. అఖిల్ మ‌ర్యాద ఇస్తూ బ్రో అని మాత్ర‌మే ట్వీట్ చేశాడు. కానీ మీరు రా అన‌డం అవ‌స‌ర‌మా…? అంటూ ఫైర్ అవుతున్నారు.

మీ మ‌ధ్య‌న ఫ్రెండ్షిప్ ఉన్న‌ప్ప‌టికీ ప‌బ్లిక్ గా అలా అనేస్తారా అంటూ మండిప‌డుతున్నారు. ఇదిలా ఉంటే కార్తికేయ అఖిల్ చాలా క్లోజ్ గా ఉంటారు. గ‌తంలో కార్తికేయ పెళ్లిలో అఖిల్ సంద‌డి చేశారు. కాగా కొంత‌మంది నెటిజ‌న్ లు కార్తికేయ అఖిల్ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ …కాబ‌ట్టే ఆ చ‌నువుతో అలా అన్నారు అంటూ కార్తికేయ‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

ALSO READ : ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

Visitors Are Also Reading