Home » అఖండ సినిమా పై చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడి రివ్యూ…!

అఖండ సినిమా పై చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడి రివ్యూ…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విజయంతో బాలయ్య-బోయపాటి కాంబోలో హాట్రిక్ కూడా కొట్టేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వందకోట్ల కలెక్షన్లను రాబట్టి ఇప్పటికీ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ చిత్రంపై సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఏపీలోని ఓ థియేటర్ కు ఏకంగా అఘోరాలు వచ్చి సినిమాలు చూసిన సంగతి కూడా తెలిసిందే.

Advertisement

Chilkur-Balaji-Temple-Priest-Ran

Chilkur Balaji Temple Priest Ran

అయితే తాజాగా ఈ సినిమాపై చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ రివ్యూ ఇచ్చారు. రంగరాజన్ పంతులు మొదటిసారి ఓ సినిమా చూసి దానిపై రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక రంగరాజన్ పంతులు అఖండ సినిమా గురించి మాట్లాడుతూ… స్వామివారి సేవక బృందంతో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా చూశాను. పోయిన వారమే ఈ సినిమా గురించి చెప్పాలని అనుకున్నా…. కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. కానీ ఇవాల్టి రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో సినిమాలో చూపించారు.

Advertisement

 

ధర్మాన్ని రక్షించడం కోసం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చింది. అహింస పరమో ధర్మః అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చూపించారు. ఇక ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది ఎందుకు ఈ చిత్రం చూస్తున్నారంటే వారి మనసులో ఆక్రోషం.. ఉక్రోషం ఉన్నాయి.” అంటూ రంగరాజన్ పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Visitors Are Also Reading