Home » సెకండ్ వేవ్ త‌ర‌వాత “అఖండ వేవ్”..భారీగా బుక్ అవుతున్న టికెట్స్..!

సెకండ్ వేవ్ త‌ర‌వాత “అఖండ వేవ్”..భారీగా బుక్ అవుతున్న టికెట్స్..!

by AJAY
Ad

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర‌వాత ర‌వితేజ హీరోగా వ‌చ్చిన క్రాక్ ప్రేక్ష‌కుల‌ను మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రప్పించింది. ఈ సినిమాతో మ‌ళ్ళీ థియేట‌ర్లలో భారీగా టికెట్లు బుకింగ్ అయ్యాయి. ఇక సెకండ్ వేవ్ త‌ర‌వాత మ‌ళ్లీ అలాంటి మాస్ సినిమా రాలేదు. అంతే కాదు ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌లైన సినిమాల‌న్నీ చిన్న‌సినిమాలే కావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ హంగామా క‌న‌పించలేదు. కానీ ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ త‌ర‌వాత థియేట‌ర్ల వ‌ద్ద అఖండ వేవ్ క‌నపిస్తోంది. బాల‌య్య న‌టించిన అఖండ సినిమా రేపు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. కాగా అన్లైన్ లో భారీగా టికెట్లు బుక్ అవుతున్నాయి.

Advertisement

AKHANDA MOVIE

AKHANDA MOVIE

ఓవ‌ర్ సీస్ మార్కెట్ లోనూ భారీగా టికెట్లు బుక్ అవుతుండ‌టంతో ఈ సినిమా మ‌ళ్లీ హౌస్ ఫుల్ ల‌ను బోర్డుల‌ను భ‌య‌టకు తెప్పించేలా క‌నిపిస్తుంది. ఇక ఇప్ప‌టికే బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ బాల‌య్య కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ లు గా నిలిచాయి. దాంతో బాల‌య్య బోయ‌పాటి కాంబోకు తెగ క్రేజ్ వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలోనే అఖండ పై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

Advertisement

BALAYYA AKHANDA

BALAYYA AKHANDA

ఈ సినిమా ఆ రెండు సినిమాల రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఆ సినిమాతో బాల‌య్య బోయ‌పాటి కాంబో హైట్రిక్ అందుకుంటుంద‌ని ఫుల్ ధీమాతో ఉన్నారు. మ‌రి ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాల‌ను రీచ్ అవుతుందా లేదా అన్న‌ది చూడాలి. ఇదిలా ఉండ‌గా బాల‌య్య బోయ‌పాటి కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాలో ప్ర‌జ్ఞా జైశ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి టీజ‌ర్ ట్రైల‌ర్ లు విడుద‌ల చేయగా క్రేజీ రెస్పాన్స్ వ‌చ్చింది.

Visitors Are Also Reading