Home » అజిత్ వాలిమై బైక్ స్టంట్ వీడియో రెడీ…

అజిత్ వాలిమై బైక్ స్టంట్ వీడియో రెడీ…

by Bunty
Ad

త‌మిళ్ ఇండ‌స్ట్రీలో అజిత్‌కు ఓ మంచి నేమ్ ఉంది, అంత‌కు మించి క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలంటే అక్క‌డి ప్రేక్ష‌కులు ప‌డి చ‌స్తారు. అజిత్‌, శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన నాలుగు సినిమాలు భారీ విజ‌యం సాధించాయి. ఈ త‌రువాత హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నెర్కొండ‌పార్వై సినిమా భారీ విజ‌యం సాధించింది. హిందీలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న పింక్ సినిమాకు ఇది రీమేక్‌.

వ‌ర‌స‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్న అజిత్‌ ఇప్పుడు నెర్కొండ పార్వై ద‌ర్శ‌కుడు వినోద్, నిర్మాత బోనీ క‌పూర్‌తో క‌లిసి వాలిమై సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తైయింది. ఈ సినిమాలో బైక్ స్టంట్ కు సంబంధించిన అనేక స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ స‌న్నివేశాల్లో అజిత్ అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఈ బైక్ స్టంట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో ప్రోమోను కాసేప‌ట్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. వాలిమై స్టంట్ వీడియో కోసం యావ‌త్ అజిత్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఆ వీడియో ఎలా ఉంటుందో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.

Advertisement

Advertisement

Visitors Are Also Reading