ఒక హీరో నటించినా చిత్రాన్ని మరొక హీరో రీమేక్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం ఏమి కాదు. ప్రతి ఒక్క హీరో కూడా తమ డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా యాక్టింగ్ తో ఆకట్టుకుంటారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అజిత్ నటించిన చిత్రాలు చాలావరకు తెలుగులో డబ్ చేయబడి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అజిత్ నటించిన చిత్రాలను రీమేక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుందామని నమ్మకంతో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయన తమిళంలో నటించిన సినిమాలను వీరిద్దరూ తెలుగులో రీమేక్ చేయగా మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయారు. ఇంకా చెప్పాలాంటే అట్టర్ ప్లాప్ టాక్ ని మూట కట్టుకున్నారు.
Advertisement
తమిళంలో అజిత్ నటించిన వీరం సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో కూడా వీరం సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయినా ఓ మోస్తారు మార్కులతో సరిపెట్టుకుంది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయడం అంతా మంచిది కాదని పవన్ అభిమానులు మొత్తుకున్నప్పటికీ పవన్ మాత్రం కాటమరాయుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నారు.
Advertisement
ఇక పవన్ కళ్యాణ్ చేసిన అదే తప్పును అన్న చిరంజీవి కూడా ఫాలో అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2015 లో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమా కూడా అప్పటిలో పరవాలేదు అనిపించుకుంది. కానీ సూపర్ హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేదు. ఇక వేదాలం సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. వేదాలం రీమేక్ తో భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు చిరంజీవి. దాదాపు దశాబ్ద కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా మెహర్ రమేష్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సినిమా కథాంశం లో కొత్తగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు.
ఈ ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక హీరో అజిత్ ను నమ్ముకున్న మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా వారి సినిమాల ద్వారా పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సైతం హీరోలు రీమేక్ సినిమాలపై కాకుండా సొంతంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈ ఫోటోలో అమాయకంగా పల్లెటూరి పిల్లలా కనిపించే అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?
పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి… ఆత్మ***త్యకు ప్రయత్నించారా?
విశాఖలో బేబీ సినిమా రిపీట్..3 కుటుంబాల్లో విషాదం !