Home » సిరాజ్ ను అవమానించారు.. అంపైర్లు కూడా ఏం మాట్లాడలేదు.. నాకు కోపం వచ్చి..?

సిరాజ్ ను అవమానించారు.. అంపైర్లు కూడా ఏం మాట్లాడలేదు.. నాకు కోపం వచ్చి..?

by Azhar
Ad
భారత్ – ఆస్ట్రేలియా మధ్య  2020-21 లో జరిగిన టెస్ట్ సిటీస్ ను ఎవరు మర్చిపోరు. అది భారతీయులకు ఒక్క అద్భుతమైన ఘటన అయితే ఆసీస్ అభిమానులకు ఓ పీడ కల. మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన తర్వాత కోహ్లీ ఇంటికి రావడం.. రహానే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడంతో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలదు అన్నారు. కానీ ఆ తర్వాత రహానే తన కెప్టెన్సీతో రెండో మ్యాచ్ గెలిపించగా… మూడో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆ తర్వాత నాలుగో మ్యాచ్ లో యువ ఆటగాళ్లకు అందరూ రాణించడంతో ఆసీస్ పై 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు.
అయితే ఈ సిరీస్ లో మూడో టెస్టు జరిగిన సిడ్నీ గ్రౌండ్లో మూడో రోజు మన బోలర్ మహ్మద్ సిరాజ్‌ను స్టేడియంలోని ప్రేక్షకులు జాత్యహంకార దూషణలు చేశారు. దీని పై తాజాగా రహానే మాట్లాడుతూ.. మూడో రోజు అలా కామెంట్స్ చేసిన తర్వాత సిరాజ్ నాకు చెప్పాడు. అప్పుడు మేము అంపైర్లకు ఫిర్యాదు చేసాం. కానీ మళ్ళీ నాలుగో రోజు అలానే జరిగింది, సిరాజ్ వచ్చి నాకు చెప్పగానే.. నేను వెళ్లి ఫీల్డ్ అంపైర్లకు చెప్పా.. మీరు వారెవరో తెలుకొని బయటకు పంపండి.. అప్పటివరకు మ్యాచ్ ఆపండి అని చెప్పను.
కానీ అంపైర్లు ఏం చెప్పలేదు. పైగా మ్యాచ్ ఆపడం కుదరదు.. మీరు వెళ్లిపోవాలి అనుకుంటే వెళ్లిపోవచ్చు అన్నారు. దాంతో నాకు ఇంకా కోపం వచ్చింది. మమల్ని వెళ్లిపొమ్మనడానికి మీరు ఎవరు. మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం.. తప్ప డ్రెసింగ్ రూమ్ లో కూర్చొని తినడానికి రాలేదు అని చెప్పా. వారిని గ్రౌండ్ నుండి పంపేయండి అని నేను.. మా టీం మొత్తం చెప్పం. ఎందుకంటే మా తోటి ఆటగాడికి జరుగుతున్న అవమానాన్ని మేము చూస్తూ ఉండలేం. ఏది ఏమైనా ఆరోజు సిరాజ్ విషయంలో జరిగింది చాలా తప్పుగా అని రహానే అన్నారు.

Advertisement

Visitors Are Also Reading