Home » Agent OTT : ఈ సారి ఓటీటీలోకి అఖిల్ “ఏజెంట్” రావ‌డం ప‌క్కా – రిలీజ్ డేట్ ఇదే!

Agent OTT : ఈ సారి ఓటీటీలోకి అఖిల్ “ఏజెంట్” రావ‌డం ప‌క్కా – రిలీజ్ డేట్ ఇదే!

by Bunty
Ad

 

Agent OTT : అక్కినేని అఖిల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదగాలి అనుకున్నాడు. కానీ తాను అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోతున్నాడు. తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం అఖిల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు.

Advertisement

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా వారు అనుకున్న అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాను అతితక్కువ రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో మేలోనే రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. కానీ ఏమైందో తెలియదు అనౌన్స్ చేసిన డేట్ ని మార్చేసింది.

ఏజెంట్ సినిమా రిలీజ్ కు, ఓటీటీ రిలీజ్ కు కనీసం 20 రోజులు కూడా గ్యాప్ ఉండకపోవడంతో మేకర్స్ కోరిక మేరకు సోనీ లివ్ రిలీజ్ డేట్ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక మరో రెండువారాల్లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading