అఖిల్ అక్కినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ హీరోగా వరుస పరాజయాలలో ఉన్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్ సాధించారు. 2021 లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సాఫ్ట్ రోల్ లో కనిపించిన అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్.
READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!
Advertisement
ఏజెంట్ పేరుతో వస్తున్న చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ నేను అక్కినేని వారసుడిగా పని చేయాలనుకోవడం లేదు. అఖిల్ గా పనిచేయాలని అనుకుంటున్నాను.
Advertisement
READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!
అక్కినేని వారసుడిగాని పని చేయాలనుకుంటే ఒకే రకంగా పని చేయవలసి వస్తుంది అని అన్నాడు. వారసత్వం అనే బాధ్యత తప్పకుండా భుజాలపై ఉంటుంది. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆ ట్రాకు లోకి వెళ్లిపోతాను. ఒక యాక్టర్ గా హార్డ్ వర్క్ తో నా ప్రోగ్రెస్ ను చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. అఖిల్ గా తెలుగు ప్రేక్షకులకు నన్ను ఓన్ చేసుకుంటే అది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నా కెరియర్ అంతా ఫైట్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.
READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త….త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్