ఒకప్పుడు అబ్బాయిలు తమకంటే చిన్న వయసు వారిని వివాహం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. తమకంటే పెద్దవారిని సైతం వివాహం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది సెలబ్రెటీలు వయసులో తమకంటే పెద్దవారై మహిళలను వివాహం చేసుకున్నారు. అలా వివాహాలు చేసుకున్న సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం….
Advertisement
Also Read: పొజిషన్ లో సూర్య స్థానంలోకి బాబర్..!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వయసులో తనకంటే పెద్దది అయిన నమ్రతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వయసులో తనకంటే ఆరు సంవత్సరాలు పెద్దది అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా వయసులో తన కంటే పెద్దది అయిన అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కంటే ఆరు నెలలు పెద్దది కావడం విశేషం.
Advertisement
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా వయసులో తన కంటే పెద్దది అయిన అమృత సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. సైఫ్ అలీఖాన్ కంటే ఆయన మొదటి భార్య అమృత సింగ్ పెద్దది. ఇక ఆమెకు విడాకులు ఇచ్చిన తరవాత సైఫ్ కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సైతం వయసులో తనకంటే పెద్దది అయిన ఐశ్వర్యరాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కంటే రెండేళ్లు పెద్దది కావడం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం నిక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా కంటే 11 సంవత్సరాలు చిన్నవాడు. ఇటీవలే మీరు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
ఏడాది క్రితం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన రాజకుంద్రా కంటే అతడి భార్య శిల్పాశెట్టి వయసులో పెద్దది అయినప్పటికీ వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
Also Read: గుమ్మడి కూతురి పెళ్లికి ఎన్టీఆర్‌ని పిలిచినా రాలేదు ఎందుకు..? ఆ ఒక్క కారణమేనా..!