Home » పొజిషన్ లో సూర్య స్థానంలోకి బాబర్..!

పొజిషన్ లో సూర్య స్థానంలోకి బాబర్..!

by Azhar
పాకిస్థాన్, ఇండియా మధ్య ఎప్పుడు ఓ వైరం అనేది ఉంటుంది అనే విషయం తెలిసిందే. క్రికెట్ లో ఈ రెండు దేశాలు కూడా ఎదురు పడిన సమయంలో ఉండే మజానే వేరు అనే చెప్పాలి. అయితే ఇండియా, పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే.. పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తిగా ఓపెనర్ల పైనే ఆధారపడుతుంది. కానీ భారత బ్యయింగ్ ఓపెనింగ్ తో పాటుగా మిడిల్ ఆర్డర్ కూడా బాగుటుంది.
ఇండియాకు ఓపెనింగ్ తర్వాత కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ పాక్ జట్టులో ఆ పరిస్థితి లేదు. అందుకే పాక్ మిడిల్ ఆర్డర్ బలంగా మారడానికి మాజీ ఆటగాడు అకీబ్ జావెద్ ఓ సూచనా అనేది ఇచ్చాడు. అదేంటంటే.. బాబర్ ఆజాంను ఓపెనర్ గా తప్పించి అతడిని సూర్య మాదిరి 4వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించాలని తెలిపాడు.
పాక్ ఓపెనింగ్ ఎంత బాగుందో.. మిడిల్ ఆర్డర్ అంత వీక్ ఉంది. ఓపెనర్లు ఔట్ కాగానే.. పాక్ ఫ్యాన్స్ కూడా మ్యాచ్ ను చూడరు. ఎందుకంటే వారికీ మిడిల్ ఆర్డర్ పైన అంత నమ్మకం. అయితే ఈ సమస్య తీరాలి అంటే.. బాబర్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలి అని తెలిపాడు. అదే విధంగా పాక్ బ్యాటర్లు.. క్రీజులో నమ్మకంతో.. ఏ భయం లేకుండా బ్యాటింగ్ చేయాలి అని.. అప్పుడే వారు ఏ జట్టును అయిన ఓడించగలరు అని అకీబ్ జావెద్ పేర్కొన్నాడు.
Visitors Are Also Reading