Home » షోయబ్ మాలిక్ పెళ్లి తర్వాత సానియా మీర్జా కుటుంబం కీలక ప్రకటన విడుదల.. అందులో ఏముందంటే..?

షోయబ్ మాలిక్ పెళ్లి తర్వాత సానియా మీర్జా కుటుంబం కీలక ప్రకటన విడుదల.. అందులో ఏముందంటే..?

by Anji
Ad

పాకిస్థాన్ నటి సనా జావేద్‌తో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పెళ్లిపై.. సానియా మీర్జా తొలిసారి స్పందించింది. ఈ మేరకు సానియా మీర్జా టీమ్, సానియా మీర్జా కుంటంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ మాలిక్ సోషల్ మీడియా వేదికపై స్పందించాడు. దీంతో సానియా మీర్జా కుంటంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న పాకిస్థానీ నటి సనా జావద్‌తో పాక్ క్రికెటర్ షోబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా తన విడాకుల గురించి వివరించింది. ముఖ్యంగా  సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్లు సానియా టీమ్ వెల్లడించింది. వాస్తవానికి సానియా మీర్జా వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ గోప్యంగానే ఉంచుకుంది. ఇప్పుడు షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకోవడంతో తప్పక స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌లు కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. మరో వివాహం చేసుకున్న షోయబ్‌ మాలిక్.. కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది” అని సానియా తరఫున ఈ ప్రకటన వెలువడింది.

Advertisement

సానియా మీర్జా వ్యక్తిగత విషయం, గోప్యతకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అనవసరపు ఊహాగానాలు కల్పించవద్దని సానియా టీమ్ కోరింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా వీరి వివాహం జరిగింది. 2018లో మీర్జా దంపతులుకు ఓ కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి సంసారంలో మాలిక్ అ**క్రమ సంబంధం చిచ్చు రేపిందని వార్తలు వినిపించడం గమనార్హం.

 

Visitors Are Also Reading