Home » సమంత నాగచైతన్య బాటలో మరో స్టార్ కపుల్…..ఎవరంటే..?

సమంత నాగచైతన్య బాటలో మరో స్టార్ కపుల్…..ఎవరంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో లో సెలబ్రెటీల లవ్ బ్రేకప్ లు, విడాకులు కామన్ గానే వినిపిస్తుంటాయి. బాలీవుడ్, టాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ప్రతి పరిశ్రమలోనూ విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవల టాలీవుడ్ జంట సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి ఆ తరవాత కొన్నేళ్ళు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

samantha-akkineni

Advertisement

దాంతో కలకాలం ఇద్దరూ కలిసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇస్తూ ఈ జంట తాము విడిపోతున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆ తరవాత కొద్దిరోజులకే మరో స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య రజినీ కాంత్ తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఈ వార్త తో కూడా అభిమానులు షాక్ అయ్యారు.

Advertisement

అంతే కాకుండా ధనుష్ ఐశ్వర్య లకు ఎదిగిన కొడుకులు ఉండటం తో ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో మరికొన్ని జంటలు కూడా విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోయిన్ కైరా అద్వానీ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారట.

 

కొంత కాలం గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారట. అంతే కాకుండా అమీర్ ఖాన్ ఫ్యామిలీ నుండి వచ్చిన అవంతిక మాలిక్ కూడా తన భర్త ఇమ్రాన్ ఖాన్ తో విడాకులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం సెపరేట్ గా ఉంటున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు విడాకుల వార్తలు గుప్పుమంటున్నా ఈ జంట మాత్రం ఆ వార్తలపై స్పందించకపోవడం తో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

Also read :

అల్లుఅర్జున్ కు క‌ట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?

Visitors Are Also Reading