ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ తరువాత చేయబోయే సినిమా ఏమిటి అనే దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ తో ఐకాన్ స్టార్ ఓ సినిమా చేయబోతున్న ప్రచారం జరుగుతోంది.
Also Read : ఇన్ స్ట్రాగ్రామ్ లోకి దళపతి విజయ్.. గంటలోనే ఫాలోవర్స్ ఎంతమంది అంటే?
Advertisement
కానీ అధికారంగా మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురగదాస్ ఈ విషయంపై స్పందించారు. “ఒక దర్శుడు చాలా మంది హీరోలతో చర్చలు జరుపుతుంటారు. అదేవిధంగా హీరోలు కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ల గురించి ఇప్పుడే ప్రకటించలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే తప్పకుండా చెబుతాను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురగదాస్.
Advertisement
Also Read : నాగచైతన్య-శోభిత గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన సమంత..!
వాస్తవానికి అల్లు అర్జున్, మురగదాస్ కాంబో గురించి చాలా కాలం చర్చ కొనసాగుతుంది. కానీ అధికారికంగా మాత్రం అనౌన్స్ మెంట్ రావడం లేదు. ఈ కాంబోలో సెట్ కావాలని బన్నీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మురగదాస్ ప్రతీ చిత్రాన్ని వైవిద్యమైన కథాంశంతో, అద్భుతమైన సందేశంతో తెరకెక్కిస్తారు. తాజాగా చాలా కాలంగా వస్తున్న వార్తలపై స్పందించారు మురగదాస్.
Also Read : రాంచరణ్ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా ? సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాసన!