ఏ.ఆర్.రెహమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను ప్రపంచంలోనే ఓ అల. ఇండియన్ మూవీ పాటకు తొలిసారిగా ఆస్కార్ ని తీసుకొచ్చిన టాలెంటేడ్ మ్యూజిక్ దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. రోజా మూవీతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఇళయరాజా శిష్యుడు తక్కువ కాలంలోనే అత్యంత అద్భుతమైన పాటలను అందించారు. మామూలుగా చాలా కాలంగా అత్యద్భుతమైన పాటలను అందించాడు. సాధారణంగా ఒక పాటలో పల్లవి బాగుంటుంది. మరో పాటలో చరణం బాగుంటుంది. ఏ.ఆర్. రెహమాన్ తెలుగులో సంగీత దర్శకుడి సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి.
Advertisement
మ్యూజిక్ దర్శకుడు సినిమాలు చాలా తక్కువ. “నీ మనసు నాకు తెలుసు” నాని, ఏ మాయ చేశావే, కొమురంపులి వంటి సినిమాలను చేశారు. తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమా తరువాత ఇప్పటి వరకు రెహమాన్ తెలుగు సినిమాకి సంగీతం అందించలేదు. ఆ సినిమా కూడా తమిళ మూవీ రీమెక్ కాబట్టి.. దానిని పరిగణలోకి తీసుకోలేము. ప్రస్తుతం రెహమాన్, రామ్ చరణ్ మూవీకి సంగీతం అందించబోతున్నట్టు సమాచారం.
Advertisement
ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు చరణ్. ఈ చిత్రాన్ని బారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఏ.ఆర్.రెహమాన్ తెలుగులో సంగీతం అందించిన స్ట్రైట్ మూవీలో కమర్షియల్ సక్సెస్ ఒకటి లేని నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రానున్న మూవి ఏ మేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.