పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల జ్యాస లోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే…కానీ పెళ్లి తరవాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవద్దు అంటే కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలట. అంతేకాకుండా కలిసి టీ తాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అలా కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది.
Advertisement
Advertisement
భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం ….సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది. దాని వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.
ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనిపించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుందట. భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం…. అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుందట.
Also read : వాళ్ళ కుక్కలకు కూడా హోటల్ రూములు కానీ….టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు…!