అప్గానిస్తాన్ ఆర్థిక మంత్రిగా పని చేశాడు. ఒకప్పుడు కాబూల్‌లో అప్జనిస్థాన్ ఆర్థిక మంత్రిగా 6 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను సమర్పించాడు ఖలీద్ పయెండా. తన కుటుంబాన్ని పోషించడానికి ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఊబర్ డ్రైవర్‌గా ఉన్నారు. తాను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆరు గంటల పాటు పని చేస్తే 150 డాలర్లకు పైగా సంపాదిస్తున్నాడని, తన ప్రయాణాన్ని లెక్కించకుండా చెప్పాడు.
అప్జనిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక, మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్ మద్దతు ఉన్న పాలనను పడగొట్టిన తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వెనుకాడుతున్నాయి. ప్రధాని అష్రఫ్ ఘనీతో సంబంధాలు తెగిపోవడంతో తాలిబన్లు రాజధాని నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వారం రోజుల ముందే ఆర్థిక మంత్రి పదవీకి రాజీనామా చేశారు.
Advertisement
Advertisement
తాను ఆర్థిక మంత్రిగా పని చేయడం గొప్ప గౌరవం అని, వ్యక్తి గత ప్రాధాన్యతలకు హాజరయ్యేందుకు పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే భయంతో అతను అప్జనిస్తాన్‌ను విడిచి పెట్టాడు. యునైటేడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తన కుటుంబంతో చేరాడు. ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన ఇంటర్వ్యూలో వెళ్లడం అనేది సర్దుబాటు అని, తన కుటుంబానికి తాను చేయగలిగిన విధంగా ఆదుకున్న కృతజ్ఞుడని చెప్పాడు.
కాబూల్ లోని ప్రపంచ బ్యాంకు అధికారికి ఒక వచన సందేశంలో రాజధాని పడిపోయిన రోజు అతను ఇలా రాశాడు. మనకు 20 సంవత్సరాలు, ప్రజల కోసం పని చేసే వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచం మొత్తం మద్దతు ఉంది. మేము నిర్మించిందంతా వచ్చిన కార్డుల ఇల్లు మాత్రమే. ఇంత వేగంగా క్రాష్ అవుతోంది. అవినీతి పునాదిపై కట్టబడిన కార్డుల ఇల్లు అని ఉటంకించారు.