Home » తొలిసారి పెళ్లిపై స్పందించిన అడివి శేష్.. ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?

తొలిసారి పెళ్లిపై స్పందించిన అడివి శేష్.. ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు బ్యాచ్‌లర్‌గా ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్‌లో మాత్రం అడివి శేషు ముందున్నాడ‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా సంద‌ర్భాల్లో ఈ యంగ్ హీరో పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఎప్పుడు కూడా క‌రెక్ట్‌గా స‌మాధానం చెప్ప‌లేదు. ఏదో ఒక స‌మాధానం చెప్పి త‌ప్పించుకుంటూ వ‌చ్చాడు అడివి శేష్‌. ఇటీవ‌ల మేజ‌ర్ సినిమా స‌క్సెస్ జోష్‌లో త‌న పెళ్లి గురించి కొన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.

Advertisement

ఇక మేజ‌ర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య జూన్ 03 విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ముంబై బాంబు దాడుల‌లో అమ‌ర‌వీరుడైన సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. మేజ‌ర్ పాత్ర‌లో అడివి శేష్ నిజంగా జీవించాడు. బాక్సాఫీస్ వ‌ద్ద మేజ‌ర్ సినిమా భారీ స్థాయిలో దూసుకుపోతుంది. అడివి శేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా మేజ‌ర్ నిలిచింది. ఇటీవ‌లే ఈ సినిమా 60కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేయ‌డం విశేషం.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. తాజాగా అడివి శేష్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ‌, పెళ్లి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలను వెల్ల‌డించాడు. యూఎస్‌లో ఉన్న‌ప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాన‌ని చెప్పుకొచ్చాడు. నా పుట్టిన రోజునే త‌న పెళ్లి అయింది. ఆ ఎఫెక్ట్ నాపై బాగా ప‌డింది. ప్రేమ‌లో దెబ్బ‌తిన‌డం వ‌ల్ల పెళ్లిపై పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. త‌న పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం అడివిశేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల‌పై దృష్టి సారించాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన హిట్‌-2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నాని నిర్మించిన ఈ చిత్రాన్ని స‌లైష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీంతో పాటు గూఢాచారి సీక్వెల్‌లో న‌టించ‌నున్నాడు.

Also Read : 

ఆ సినిమా షూటింగ్ కోసం ఎందుకు రాజశేఖర్ విలన్ రామి రెడ్డిని బట్టలు విప్పి మరీ రోడ్ పై కొట్టాడు.. ?

తమ పిల్లల్లకి పెళ్లి చేసేముందు తల్లి దండ్రులు తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు..!

 

Visitors Are Also Reading