Home » ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఆదిపురుష్ రైటర్..!

ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఆదిపురుష్ రైటర్..!

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ ‘అదిప్యుష్’ సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి  మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా?

Advertisement

బాలీవుడ్లోని టాప్ రైటర్స్లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. ‘తేరే మిట్టి’, ‘గల్లియన్’, ‘కౌన్ తుజే’ లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో అడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మర్చిపోయారు.

Advertisement

అలాంటిది రైటర్ మనోజ్ ముంతషీర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా
మారింది.

Also Read  :  ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు.. కారణం అదేనా ?

Visitors Are Also Reading