Home » ఖడ్గం సినిమాలో సంగీత పాత్రను వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?

ఖడ్గం సినిమాలో సంగీత పాత్రను వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?

by Sravya
Ad

ఖడ్గం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్ సినిమాలలో దేశభక్తి సినిమాలకి సంబంధించి మనం లిస్టు తీసినట్లైతే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా మనకు ఖడ్గం సినిమా గుర్తొస్తుంది. ఖడ్గం సినిమాని కృష్ణవంశీ తెర మీదకి తీసుకువచ్చారు. కృష్ణవంశీ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. ఈ సినిమా డిఫరెంట్ జోనర్ లో వచ్చింది. ప్రతి విషయంలో దేశభక్తికి అర్థం పట్టే విధంగా డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాని తెర మీదకు తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా మతాల మధ్య అంతరాయం తగ్గించి దేశభక్తిని పెంపొందించే విధంగా అనేక అంశాలని చూపించడంలో పెద్ద హిట్ ని అందుకున్నారు ఈ సినిమాలో సీనియర్ హీరోలు శ్రీకాంత్ అలానే ప్రకాష్ రాజు రవితేజ నటించారు.

khadgam

khadgam

హీరోయిన్లుగా సోనాలి బింద్రే సంగీత వంటి నటీమణులు నటించి అందర్నీ మెప్పించారు. సినిమా మొదలయ్యి టైం కి మొదటి సంగీత కి బదులుగా సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలని కృష్ణ వంశీ అనుకున్నారు. సంగీత ప్లేస్లో ఎవరిని అనుకున్నారంటే సాక్షి శివానంద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించారు. ఈ సినిమాకి సంబంధించి ముందు కృష్ణవంశీ సాక్షి శివానంద్ ని ఎంపిక చేయాలని అనుకున్నారు.

Advertisement

Advertisement

ఆమెని అందుకోసం సంప్రదించారు కూడా. కానీ ఆమె ఆ పాత్ర చేయనని చెప్పేసారట సోనాలి బింద్రే క్యారెక్టర్ అయితే చేస్తానని అన్నారు. డైరెక్టర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ అయితే అవసరం లేదని చెప్పేసారు. సంగీత ని ఫైనల్ చేశారు. విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందారు. ఈ సినిమా తర్వాత సంగీత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లపాటు కొనసాగించారు. సంగీత తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. కుర్ర హీరోలకి హీరోయిన్లకి ప్రస్తుతం తల్లి పాత్రలో నటిస్తూ అందరిని మెప్పిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading