Home » “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ వినీత అంటే ఎవరు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” సినిమాలో మనీషా అంటే టక్కున గుర్తుపడతారు. ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. తన అందం, అమాయకత్వంతో, మాటలతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వినీత 1993 సంవత్సరంలో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. వినీత దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

actress vineetha changed alot

తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు స్టార్ అగ్రహీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అనంతరం వినీతకి సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు అలాంటి కేసులో పట్టుబడింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి జైల్లో వేశారు.

Advertisement

చాలామందికి వినీత డబ్బు ఆశ చూపి అలాంటి పనులు చేపిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక కొన్ని సంవత్సరాల పాటు ఈ కేసు నడిచింది. ఆ తర్వాత వినీత మానసిక స్థితి సరిగ్గా లేదని జైల్లో నుంచి విడుదల చేశారు. ఇక జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి తాను సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. వినిత ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి ఆకారాన్ని పూర్తిగా కోల్పోయి అంద వికారంగా తయారైంది. వినీత ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading