టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉన్న నటి సుధ. అంతే కాకుండా సుధ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ గుర్తింపు ఉంటే పాత్రల్లోనే నటించి మెప్పించింది. తొమ్మిది వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిచింది. సుధ సినిమా లైఫ్ లో ఎంత సక్సెస్ అయ్యిందో ఫ్యామిలీ లైఫ్ లో అన్ని కష్టాలను చూసినట్టు తాగాజా ఓ ఇంర్వ్యూలో తెలిపింది. ఆమె తండ్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా తల్లి గృహిణి అని తెలిపింది.
Advertisement
తన తండ్రి చాలా ఆస్తులు సంపాదించాడని కానీ ఆయన క్యాన్సర్ బారిన పడటంతో సంపాదించిన ఆస్తి మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి అనారోగ్యం బారిన పడటంతో తన నలుగురు సోదరులు పేరెంట్స్ ను వదిలేసారని దాంతో వాళ్ల బాధ్యతను తానే చూసుకున్నానని చెప్పింది. కానీ తన తండ్రి క్యాన్సర్ తో, తల్లి హార్ట్ ఎటాక్ తో మరణించారని తెలిపింది. ఇక తన భర్త అమెరికాలో వ్యాపారవేత్త అని తన కొడుకు కూడా ఆయన వద్దనే ఉంటారని వాళ్లిద్దరూ తనను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాని చెప్పింది.
Advertisement
దాంతో తన కూతురు వివాహ బాధ్యతలను తానే చూసుకున్నానని కూతురుకు పెళ్లి చేసి మనవరాళుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్ననని తెలిపింది. తన భర్త, కొడుకు వదిలేసి వెళ్లిపోయారని వాళ్లకు కూడా ఎప్పుడో ఒకసారి తనలాంటి పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు పోయినందుకు తనకు ఏమీ బాధగా లేదని కానీ తన తల్లి దండ్రులు చనిపోయినందుకే బాధపడుతున్నానని చెప్పింది.
సినిమాల్లో తాను కూడా బాగా సంపాదించానని ఆ డబ్బుతో ఢిల్లీలో రెండు హోటల్స్ పెట్టి నష్టపోయానని చెప్పింది. మళ్లీ సినిమాల్లో నటించి నిలదొక్కుకున్నానని వెళ్లడించింది. ఇక ఇప్పుడు తన మనవరాళు సుధ అని పిలిస్తే అచ్చం తన తల్లి పిలిచినట్టే అనిపిస్తుందని చాలా సంతోషంగా ఉంటుందని సుధ ఎమోషనల్ అయ్యింది.