టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నాడు.
Advertisement
కెరీర్ లో వచ్చిన ఇబ్బందులతో ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా ఎదిగాడో అంతే స్పీడ్ తో డౌన్ ఫాల్ అయ్యాడు. సినిమా ఆఫర్లు తగ్గిపోవడం…వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి పోవడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
చివరికి ఆ డిప్రెషన్ నుండి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తాజాగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా పలు చిత్రాలలో నటించిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయి ఉంటారని యాంకర్ ప్రశ్నించగా…అతడిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఉంటారని అన్నారు. అది ఎవరన్నతాను తాను పాయింట్ అవుట్ చేయలేనని అన్నారు. కొంతమంది తమను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో బయటపెడతారని కానీ కొంతమంది అలా బయటపెట్టకుండా లోపలే కుమిలిపోతారని సుధ అన్నారు.
Advertisement
ఉదయ్ కిరణ్ ఎంతో క్షోభ అనుభవించాడని అన్నారు. ఏంతో బాధపడి ఉంటాడని అన్నారు. కొంతమంది ఎన్ని కౌన్సిలింగ్ లు తీసుకున్నా కూడా కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడే భాగుంటుందని ఆ తరవాత మళ్లీ పరిస్థితి అదేవిధంగా ఉంటుందని చెప్పారు. చివరి రోజుల్లో ఉదయ్ కిరణ్ తనను కలవలేదని అన్నారు. తన అసిస్టెంట్ ను పంపించినా కూడా కలిసేవాడు కాదని ఇంట్లోనే ఉండి కూడా కలవలేదని చెప్పారు.
తాను ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకుందామని అనుకున్నా అని ఒకవేళ అదే జరిగితే ఈ పుత్రశోకం తాను అనుభవించాల్సి వచ్చేదేమో అంటూ సుధ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలలో ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకోవాల్సిందని కానీ పరిస్థితుల కారణంగానే అది జరగలేదేమోనని వ్యాఖ్యానించారు. చివరిరోజులలో తనవద్దకు వచ్చి కాళ్లు పట్టుకుని ఏడ్చారని చెప్పింది. నేను ఒంటరవుతున్నా అంటూ ఏడ్చాడని తాను బిజినెస్ పెట్టిస్తానని చెప్పినా వినలేదని తెలిపారు.
ALSO READ :
కెజీఎఫ్- 2 పై పొగడ్తలు ఆ హీరోలపై సెటైర్ లు…వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్…!
అక్కినేని నాగార్జున ఆ నిర్ణయం తీసుకున్నారా ? సమంత కి మరో షాక్ తప్పదా ?