Home » కెజీఎఫ్- 2 పై పొగడ్తలు ఆ హీరోలపై సెటైర్ లు…వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్…!

కెజీఎఫ్- 2 పై పొగడ్తలు ఆ హీరోలపై సెటైర్ లు…వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్…!

by AJAY
Ad

ఎంతోకాలం నుండి సినిప్రేమికులు ఎదురుచూస్తున్న కేజీఎఫ్ పార్ట్ 2 ఈ నెల 14న థియేటర్ లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమాలోని యాక్షన్ సీన్లు, హీరో ఎలివేషన్ లు అదిరిపోయాయి అంటూ రివ్యూలు వస్తున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Ramgopal varma

Ramgopal varma

కాగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కేజీఎఫ్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. స్టార్ రెమ్యునరేషన్ తో కాకుండా మేకింగ్ కు ఖర్చు చేస్తే బిగ్గెస్ట్ హిట్లు వస్తాయి అంటూ కామెంట్ చేశారు. దానికి కేజీఎఫ్ సినిమానే ఉదాహరణ అంటూ ప్రశంసలు కురిపించారు. కన్నడ ఇండస్ట్రీ ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్ కేజీ ఎఫ్ 2 తో కన్నడ ఇండస్ట్రీ ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. అంటూ పొగిడారు. ఇక వర్మ ఎటకారం చూస్తుంటే కెజీఎఫ్ ను పొగుడుతూ ఎక్కువ రెమ్యూనేషన్ తీసుకునే హీరోలపై సెటైర్ లు వేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

Visitors Are Also Reading