Home » న‌టి స‌త్య కృష్ణ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

న‌టి స‌త్య కృష్ణ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో న‌టీన‌టుల వార‌సుల ఎంట్రీ కామ‌న్ గానే ఉంటుంది. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీల వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. చాలామంది హీరోలు త‌మ కుమారుల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేశారు. అంతే కాకుండా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా త‌మ వార‌సుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా త‌మవార‌సుల‌ను ఇండ‌స్ట్రీకి పరిచ‌యం చేశారు.

Advertisement

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సురేఖ‌వాణి త‌న కూతురును హీరోయిన్ గా ప‌రిచ‌యం చేసేందుకు సిద్దం చేస్తోంది. ఇదిలా ఉంటే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ స‌త్య కృష్ణ‌న్ కూడా త‌మ కుమార్తెను న‌టిగా ప‌రిచ‌యం చేసింది. అయితే స‌త్య కృష్ణ‌న్ కుమార్తె ఎవ‌రు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.

Advertisement

స‌త్య కృష్ణ‌న్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఎక్కువ‌గా స‌త్య కృష్ణ‌న్ హీరో హీరోయిన్ ల‌కు అక్క వ‌దిన లాంటి పాత్ర‌ల‌లో న‌టించి అల‌రించారు. అంతే కాకుండా త‌న కామెడీ టైమింగ్ తో మెప్పించి లేడీ క‌మెడియ‌న్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక స‌త్య కృష్ణ‌న్ కూడా త‌న కుమార్తెను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. స‌త్య కూతురు పేరు అన‌న్య కృష్ణ‌న్…కాగా గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు అనే సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. మ‌రోవైపు రీసెంట్ ఊ అంటావా మావ ఊఊ అంటావ సినిమాలో కూడా న‌టించింది. ఇక అన‌న్య సోషల్ మీడియాలో త‌న ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో నెటిజ‌న్ లు ఫిదా అవుతున్నారు. అన‌న్య క్యూట్ లుక్స్ కు లైక్ ల వ‌ర్షం కురుస్తోంది.

Visitors Are Also Reading