టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తగ్గేదేలేదంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. శాకుంతలం, ఖుషి చిత్రాలలో నటిస్తోంది. ఇందుకోసం జిమ్ లో తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది.
Advertisement
అలాగే ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం సమంత నటిస్తుంది.ఈ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ లో సమంత గూడచారిగా కనిపించబోతుంది. దీంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ స్టంట్స్ లో సమంత నటించబోతుంది. ఈ క్రమంలోనే యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్న సమంతకు తీవ్రగాయాలు అయ్యాయి.
Advertisement
యాక్షన్స్ సన్నివేశంలో తన చేతికి గాయాలు అయిన ఫోటోలు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, ‘ఈ గాయాలు యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి మరింత ప్రోత్సాహిస్తున్నాయి’ అంటూ రాసుకోచ్చింది. అంతేకాదు ఈ సిరీస్ కోసం సమంత, స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వంటివి కూడా చేస్తుంది. ఇక ఇటీవలే సమంత అనారోగ్యం నుంచి కోలుకోని తిరిగి షూటింగ్ లో పాల్గొంటుంది. దీంతో ఇప్పుడు ఈ స్టోరీ చూసినా అభిమానులు వర్క్ పై ఆమెకు ఉన్న డేడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. మరికొంతమంది అయితే ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు.
READ ALSO : Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!