కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నాకు తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది.
Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “ఆది” సినిమా హీరోయిన్ ..? ఇప్పుడు ఎలా ఉందంటే ?
Advertisement
ఇప్పటివరకు ప్రగతి చాలా సినిమాలో నటించినప్పటికీ ఎఫ్-2 సినిమాలో ఆమె కామెడీ సైతం చేసి అదరగొట్టింది. అంతే కాకుండా ఆ పాత్రకు ప్రగతి తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్న మాదిరిగా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. కేవలం సినిమాలతోనే కాకుండా ప్రగతి సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఏజ్ పెరిగినప్పటికీ హీరోయిన్ల మాదిరిగా ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ గ్లామర్ షో చేస్తోంది.
Advertisement
అంతేకాకుండా జిమ్ లో కష్టపడుతూ ఫిట్నెస్ వీడియోలను… అదేవిధంగా డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగతి చీరలో స్టెప్పులు వేస్తూ ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియోకు…. “నేను యంగ్ గా కనిపించడానికి ప్రయత్నించడం లేదు…. దేశోద్ధారకులారా నేను నా జీవితాన్ని గడుపుతున్నాను.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దానికి ఓ యువకుడు …..అలాగే మేడం బతకాలి అంటే ఇలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేయాలని మా వాళ్లకు తెలియదు.
ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ వీడియో వాళ్లకు చూపిస్తాను. అంటూ సెటైర్ వేశాడు దానికి ప్రగతి తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. అది మాకు నచ్చిన బతుకు నాయనా… నీకు నచ్చినట్టు నువ్వు బతుకు అంటూ కౌంటర్ వేసింది. దాంతో పలువు నెటిజన్స్ ప్రగతికి సపోర్ట్ గా ఇచ్చిపడేసిందిగా …అంటూ కామెంట్స్ పెడుతున్నారు.