Home » తల్లి కాబోతున్న మరో నటి.. అభిమానులు శుభాకాంక్షలు..!

తల్లి కాబోతున్న మరో నటి.. అభిమానులు శుభాకాంక్షలు..!

by Anji
Ad

ఈ 2022లో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహ జీవితంలో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరికొందరూ తల్లిగా కూడా మారారు. ఈ సంవత్సరం కొత్త జీవితంలోకి అడుగుపెట్టి వచ్చే ఏడాదిలో తల్లిగా కాబోతున్నారు నటి పూర్ణ. బుల్లితెరపై సక్సెస్ పుల్ అయిన నటి పూర్ణ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పూర్ణ ఈ ఏడాది జూన్ 12న ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. 

Manam News

Advertisement

వీరిద్దరి పెళ్లి దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. అయితే వివాహ విషయాన్ని రహస్యంగానే ఉంచిన పూర్ణ కొద్ది రోజుల తరువాత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నటి పూర్ణకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలిసిపోయింది. పెళ్లి జరిగిన విషయాన్ని రహస్యంగా ఉంచిన పూర్ణ తాజాగా కొత్త సంవత్సరం రాబోతున్న సమయంలో అభిమానులకు ఓ శుభవార్త పంచుకున్నారు.  

Advertisement

Also Read :  ఆహాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్…అదే జ‌రిగితే ఊరుకోం అంటూ..?

ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను తల్లి అయినట్టు అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్ణ తల్లి కాబోతుందని తెలియడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ కుట్టి. ఆ తరువాత సీమటపాకాయ్, అవును, అవును2, లడ్డుబాబు, జయమ్మ నిశ్చయమ్మురా వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత శ్రీమంతుడు, రాజు గారి గది, సిల్లి ఫెల్లోస్, అదిగో సువర్ణ సుందరి, పవర్ ప్లే, తీస్మార్ ఖాన్, అఖండ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరా చిత్రంలో నటిస్తోంది. 

Also Read :   డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.? ఆమె ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading