Home » మా ఊరి పొలిమేర సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

మా ఊరి పొలిమేర సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు తక్కువగా కనిపించేవారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల హవానే కనిపిస్తోంది. చాలామంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు. అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్న నటి కామాక్షి భాస్కర్ల. పొలిమేర సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. కామాక్షి ప్రియరాలు అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

Advertisement

Kamakshi

Kamakshi

Advertisement

ఇక రీసెంట్ గా మా ఊరి పొలిమేర సినిమాలో సత్యం రాజేష్ కు భార్య గా నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత ఉండటంతో నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దిల్ రాజు అల్లుడు హీరో గా రాబోతున్న రౌడీ బాయ్స్ సినిమాలో కూడా కామాక్షి భాస్కర్ ముఖ్యమైన పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కామాక్షి గురించి చెప్పుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కామాక్షి డాక్టర్ వృత్తిలో కొనసాగింది. అపోలో హాస్పిటల్ లో సైతం డాక్టర్ గా విధులు నిర్వహించింది. కామాక్షి చైనాలో మెడిసిన్ పూర్తిచేసింది. ఆ తర్వాత 2018లో మిస్ తెలంగాణగా ఎంపికయింది.. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో యువతను తనపైపు తిప్పుకుంది.

Visitors Are Also Reading