టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది అక్కినేని నాగచైతన్య, సమంత అనే చెబుతారు. కానీ ఏడాది కిందట తమ వ్యక్తిగత కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్నా అనంతరం తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత. అటు అక్కినేని నాగచైతన్య ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు వ్యాపారంలో కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం చైతు ‘షోయు’ అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాడు.
Advertisement
అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. శోభిత దూళిపాళతో చైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో నాగచైతన్య ప్రేమాయణం నడుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని టాక్ కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ మజిలీ అనే సినిమాలో నటించారు.
Advertisement
అంతేకాదు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణం అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో దివ్యాంశ ఈ వార్తలపై స్పందించింది. నాగచైతన్య చాలా బాగుంటాడని ఐ లవ్ చై అని చెప్పింది. అతనిపై తనకు క్రష్ ఉందని, అయితే ఆమె పెళ్లి చేసుకోబోతున్నామని వార్తల్లో నిజం లేదని తెలిపింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో తనకు ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణమనే వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేసింది.
READ ALSO : TarakaRatna : తారక రత్న హెల్త్ బులిటెన్ సరికొత్త విషయాలను బయటపెట్టిన వైద్యులు !