Home » అత‌డితో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర‌వాత తీవ్ర‌మైన డిప్రెష‌న్…రామ్ హీరోయిన్ ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

అత‌డితో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర‌వాత తీవ్ర‌మైన డిప్రెష‌న్…రామ్ హీరోయిన్ ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

by AJAY
Ad

బిగ్ బాస్ ఓటీటీ ఇప్ప‌టికే ప్రారంభం అయ్యింది. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి హీరోయిన్ బింధు మాధ‌వి ఎంట్రీ ఇచ్చింది. కొంత‌కాలంగా టాలీవుడ్ కు దూర‌మైన బిందు మాధ‌వి మ‌ళ్లీ తెలుగు వారికి ద‌గ్గ‌ర‌య్యేందుకే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇక బిందు మాధ‌వి ఆవ‌కాయ్ బిర్యాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత రామ్ హీరోగా న‌టించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

తెలుగు అమ్మాయి అనే కార‌ణ‌మో….ఇత‌ర కార‌ణాలో కానీ బిందు మాధ‌వి మాత్రం టాలీవుడ్ లో నిల‌దొక్కుకోలేక‌పోయింది. దాంతో త‌మిళ్ లో ప్ర‌య‌త్నాలు చేసి అక్క‌డ హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసింది. ఇక ఆ త‌ర‌వాత త‌మిళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫైన‌ల్ వర‌కూ రాణించింది. ఈ ముద్దుముగుమ్మ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా అభిమానుల‌ను అల‌రిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే బిందు మాధవి తాజాగా త‌న ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి ఎమోష‌న‌ల్ అయ్యింది. కాలేజీ రోజుల‌లో ఓ అబ్బాయిని ప్రేమించాన‌ని తెలిపింది. ఉన్న‌త చ‌దువుల కోసం అత‌డు అమెరికా వెళ్లాడ‌ని…సినిమాల కోసం తాను ఇక్క‌డే ఉండిపోవ‌డం వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. అత‌డికి పెళ్లి కూడా అయిపోయింద‌ని అత‌డితో ల‌వ్ ఎప్పుడూ త‌నకు స్పెష‌లే అని చెప్పింది.

అంతే కాకుండా అత‌డి పెళ్లి త‌ర‌వాత డిప్రెష‌న్ లోకి వెళ్లిన‌ట్టు వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలోనే బిగ్ బాస్ త‌మిళ్ ఆఫ‌ర్ రావడంతో అందులో పాల్గొన్నాన‌ని చెప్పింది. ఆ త‌ర‌వాత కొన్ని రోజుల‌కు డిప్రెష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు బిందు మాధ‌వి బ‌య‌ట‌పెట్టింది. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా క‌నిపిస్తూ క్యూట్ లుక్ బిందు మాధ‌వి త‌న‌కంటూ అభిమానుల‌ను సంపాదించుకుంటుంది.

Visitors Are Also Reading