Home » వివాదాలతో సినిమా కెరీర్ నాశనం చేసుకున్న నటులు….!

వివాదాలతో సినిమా కెరీర్ నాశనం చేసుకున్న నటులు….!

by Bunty
Ad

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నటువంటి నటులు ఏవో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల వారి కెరీర్ ని నాశనం చేసుకున్నారు. సినిమాల్లో నటించి స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి స్థానంలో ఉంటారనుకున్నటువంటి గొప్ప నటులు తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న కారణాలవల్ల వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ వివాదాల నుంచి తర్వాత బయటపడినప్పటికీ వారిని ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడంతో వారి కెరియర్ నాశనమైంది. అందులో స్టార్ హీరోలు సైతం ఉన్నారు. తెలిసో తెలియకో వారు చేసిన చిన్న తప్పు వల్ల కెరియర్ నాశనం చేసుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

# ఉదయ్ కిరణ్
ఇండస్ట్రీలో ఒకప్పుడు తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నటువంటి ఉదయ్ కిరణ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ జరుపుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో అతను మనస్థాపానికి గురై ఆత్మ****హత్య చేసుకున్నాడు.

Do you know the background of Suman's wife

# సుమన్
తన అందం, అద్భుతమైన నటనతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి సుమన్ ఓ చిన్న కారణం వల్ల వివాదంలో చిక్కుకొని జైల్లో పడ్డారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ ఇతనికి సినిమాల్లో హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అతని సినిమా కెరియర్ నాశనం అయ్యింది.

Advertisement

# చిత్రం శ్రీను
“చిత్రం” సినిమాలో శ్రీను ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లో నటిస్తున్న కొన్ని రోజులకి వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే మళ్ళీ రెండవ వివాహం చేసుకోవడంతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. దీంతో చిత్రం శీను కెరియర్ ముగిసిపోయింది.

# పృధ్విరాజ్
30 ఇయర్స్ పృథ్వీరాజ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో ఏళ్లుగా కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించిన పృద్వి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇతను ఒక అమ్మాయితో ఫోన్ కాల్ లో చాలా అసభ్యకరంగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ ఆడియో కాస్త వైరల్ అవ్వడంతో ఇతని కెరియర్ ముగిసిపోయింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading