పెళ్లికి సరైన ఏజ్ పాతికేళ్లు లేదా ముప్పై ఏళ్ల లోపు ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కాకుండా మొదటి భార్య లేదా భర్తకు విడాకులు ఇచ్చి ముసలి వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అలా లేటు వయసులో పెళ్లి చేసుకునేవారిలో సినిమా తారలే ఎక్కువ కనిపిస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో ముప్పై నాలుగేళ్ల మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
Advertisement
అయితే ఆశిష్ కంటే ముందు చాలా మంది తారలు లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 41 ఏళ్ల వయసులో అన్నా లెజొనొవాను వివాహం చేసుకున్నాడు.
ఇది పవన్ కల్యాణ్ కు మూడో వివాహం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 49 ఏళ్ల వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నది అయిన మన్యతను రెండో పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
అంతే కాకుండా టాలీవుడ్ నటుడు వీకే నరేష్ గత కొద్దిరోజులుగా పవిత్రతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 45 ఏళ్ల వయసులో తన మొదటి భార్యను వదిలిపెట్టి కిరణ్ రావ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి దంగల్ నటిని వివాహం చేసుకోబోతున్నాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటి భార్యకు విడాకులు ఇచ్చ నయన్ తో ప్రేమాయణం నడిపించాడు. ఆ తరవాత ఇద్దరూ విడిపోయారు. ఇక ప్రభుదేవా ఆ తరవాత ఓ డాక్టర్ తో ప్రేమలో పడి 47 ఏళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ హీరో కమ్ విలన్ జేడీ చక్రవర్తి 46 ఏళ్ల వయసులో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కూడా విడిపోయాడని టాక్.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో మరణించడంతో 49 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
ALSO READ : నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏం చేయాలో తెలుసా…?