టాలీవుడ్ నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీకి భువనగిరి ఏరియాలో తనకు ఉన్న 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన పలువురు రియల్ మీరో అని కొనియాడుతున్నారు నెటిజన్లు. నిన్న మొత్తం సోషల్ మీడియాలో సుమన్‌ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేశారు. కేటీఆర్ నేతృత్వంలో సుమన్ విరాళం అందజేసినట్టు చాలా డిస్కష్కన్‌లే నడిచాయి. ఈ వార్తలపై సుమన్ స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదు. వాటిని అసలు నమ్మవద్దు.
Advertisement
Advertisement
భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఇప్పటికీ నడుస్తోంది. ఆ వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించిన ఏ విషయం అయినా నేను వెల్లడిస్తాను. అప్పటి వరకు ఇలాంటి వార్తలను దయచేసి సృష్టించకండి అని సుమన్ విన్నవించుకున్నారు. కార్గిల్ వార్ సమయంలో అనగా.. 28 ఏళ్ల క్రితం సుమన్ ఇండియన్ ఆర్మీకి భూమిని విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
అప్పట్లోనే దీని కోసం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ 117 ఎకరాల భూమి లిటికేషన్‌లో పడిందట. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉన్నది. ఈరోజు వచ్చిన వార్తలతో సుమన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చిందేమో.. అని కొంత మంది అనుకుంటున్నారు. కోర్టు వివాదం లో ఉంది. ఆర్మీకి ఇచ్చినట్టు వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదని వెల్లడించారు.