Telugu News » Blog » యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌రోనా పాజిటివ్‌..!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌రోనా పాజిటివ్‌..!

by Bunty
Ads

క‌రోనా రోజు రోజుకు ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభ‌న కొన‌సాగుతుంది. కొద్దిరోజులు త‌గ్గిన‌ట్టే త‌గ్గినా ఈ మ‌హ‌మ్మారి క‌రోనా మ‌ళ్లీ ప్రపంచాని గడగడలాడిస్తూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలే కాకుండా స్టార్ సెల‌బ్రిటీలు సైతం మళ్లీ క‌రోనా మహమ్మారి బారిన ప‌డుతుండడం అందరిని టెన్షన్ కు గురిచేస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్‌ బ్యూటీ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement

Advertisement

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాక్షన్ కింగ్ అర్జున్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన‌ట్టు తెలుస్తుంది. ఆరోగ్యం బాగోలేక వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింద‌ని హీరో అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఆయనకు క‌రోనా పాజిటివ్‌గా వచ్చిందని.. డాక్టర్స్ సూచ‌న‌లు పాటిస్తూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా అని, ఈ మ‌ధ్య తనను క‌లిసిన వారు కూడా ద‌య‌చేసి క‌రోనా టెస్ట్ చేయించుకోండి అని అర్జున్ సూచించారు.