మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా నటించారు. అంతే కాకుండా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు చరణ్ పాత్ర సినిమాలో 30 నిమిషాల పాటూ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హరోయిన్ గా నటించింది. ఎప్పిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే సినిమా విడుదల సమయంలో ఆచార్య యూనిట్ కు ఊహించని షాక్ తగిలింది. ఆచార్య సినిమా కథ తనదే అంటూ రచయిత రాజేష్ మండూరి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజేష్ మండూరి ఆరోపణలు చేశారు. ఆచార్య కథను తాను తన గ్రామంలోని రామాలయంలో జరిగిన ఓ ఘటన ఆదారంగా రాసుకున్నానని చెప్పారు. బాలయ్య హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నట్టు తెలిపారు.
Advertisement
ఈ కథను సినిమా తీయాలని అనుకున్నట్టు చెప్పారు. దాంతో మైత్రీమూవీమేకర్స్ వారికి ఈ కథను వినిపించానని అన్నారు. మైత్రీ వారికి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి కథను చెప్పానని అన్నారు. అతడు కథ వినే సమయంలో రికార్డింగ్ చేశాడని చెప్పాడు. అంతే కాకుండా ఈ కథను కొరటాల శివ తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నట్టు తెలిపారు. ఈ కథకు బడ్డెట్ ఎక్కువ అవుతుందని కొత్తవారు అంటే ఎవరూ బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రారని అన్నాడని చెప్పారు.
కథ విని సైలెంట్ వెళ్లారని తనకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో నచ్చలేదని అనుకున్నట్టు తెలిపారు. దాంతో తాను లైట్ తీసుకున్నా అని కానీ కొరటాల శివ అదే కథతో సినిమా చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఆ కథ తనదే అని ఈ విషయంపై అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కొరటాలకు కథ పంపానని ఆయన ఆచార్య కథ వేరని చెప్పారని అన్నారు. కానీ తనకు ఆచార్య కథను పంపలేదని వందకోట్ల కథ ఎలా పంపాలి అని చెప్పి పంపకుండా ఉన్నారని తెలిపారు.
ALSO READ :
మెగాస్టార్ ఆచార్య రన్ టైమ్ ఎంతంటే..?
KAJAL AGARWAL : కాజల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చందమామ..!