World Cup 2023 : డెంగ్యూ దోమలు క్రికెట్ పై పగ పట్టినట్టు ఉన్నాయి. డెంగ్యూ బారిన పడిన టీమిండియా బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రపంచకప్ లో ఆడాలనే తన కలను నెరవేర్చుకునేందుకు తాను శక్తిని తెచ్చుకొని ఇప్పుడిప్పుడే మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్లకు దూరమైన ఈ బ్యాటర్ పాకిస్తాన్ తో. జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం నెట్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నీరసంగా ఉన్నప్పటికీ గిల్ తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ డెంగ్యూ దోమ ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే ను కూడా కుట్టింది.
దీంతో ఇతను కూడా డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో బోగ్లే కూడా అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కు దూరమైనందుకు బాధగా ఉందని ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తిరిగి 19వ మ్యాచ్ కు తిరిగి రావాలని ఆశిస్తున్నాను. నా సహోద్యోగులు అందరూ నాకు అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటూ కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ లో పేర్కొన్నాడు. హర్ష సాధారణమైన వ్యక్తి కాదు. తనదైన కామెంటరీతో మ్యాచ్ ను ఉర్రూతలు ఊగిస్తారు.
Advertisement
Advertisement
దాదాపు 40 సంవత్సరాలుగా క్రికెట్ కు సేవలు అందిస్తున్నాడు. క్రికెట్ పై అతనికి ఉన్న ప్రేమ, ఆసక్తి, లోతైన అవగాహన, వాయిస్ తనకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. మరోవైపు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు వేలసంఖ్యలో అహ్మదాబాద్ కు క్యూ కడుతున్నారు. దాదాపు లక్షన్నర మంది ఈ మ్యాచ్ ను చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇరు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్లు ఆడగా… ఆ రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోరు మీద ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : వివాదంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రద్దు చేస్తారా ?
- గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలివే..ఈ నెలలో రెండు గ్రహణాలు !
- Lavanya Tripathi : నిహారికకు లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్…మెగా పరువు తీయకంటూ !