Home » గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలివే..ఈ నెలలో రెండు గ్రహణాలు !

గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలివే..ఈ నెలలో రెండు గ్రహణాలు !

by Bunty
Ad

మనదేశంలో ప్రతి ఒక్కరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. పండుగలను ఏ విధంగా అయితే జరుపుకుంటారో కొన్ని రకాల ఆచారాలను పూర్వకాలం నుంచి పాటించడం ఆనవాయితీ. అలానే సూర్యగ్రహణం, చంద్రగ్రహనాన్ని కూడా తప్పకుండా పాటిస్తారు. ఈ సంవత్సరం 2023 అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. గ్రహణ సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం….

Solar Eclipse Pregnancy Precautions

Solar Eclipse Pregnancy Precautions

గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. గ్రహణ ప్రారంభానికి ముందే భోజనం చేయడం వంటి కార్యక్రమాలు పూర్తిచేసుకుని పడుకోని ఉండాలి. చేతులు, కాళ్లు కదపడం, ఎవరిని దుషించడం, లేచి నడవడం వంటి పనులు చేయకూడదు. కదలకుండా పడుకొని ఉండాలి. గ్రహణప్రభావం కడుపులోని బిడ్డలపై తప్పకుండా పడుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం రేపు రాత్రి 8:35 నిమిషాలకు ప్రారంభమై… తర్వాత రోజు ఉదయం 2:30 నిమిషాలకు ముగుస్తుంది. సుమారు 6 గంటలపాటు గ్రహణం ఉంటుంది.

Advertisement

Advertisement

ఈ సంవత్సరం ఈ గ్రహణ ప్రభావం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ముఖ్యంగా కన్య రాశి వారిపై ప్రభావం చూపుతుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం మన భారతదేశంలో లేదు. సూర్యగ్రహణం కెనడాలో ఉంటుంది. ఇక భారతదేశంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ సాధారణ వ్యక్తులు దీనిని పెద్దగా పాటించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా దీనిని పాటించాలి. ఈ సృష్టికి సూర్యచంద్రులు ఒక్కరే కాబట్టి గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. ఈ సూర్యగ్రహణానికి ముఖ్యంగా ఓ ప్రత్యేకత ఉంది. ఈ సూర్య గ్రహణం “రింగ్ ఆఫ్ ఫైర్” ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నదని నాసా సైంటిస్టులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading