ఎండాకాలం వచ్చేసింది. ప్రారంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఇక మరికొద్దిరోజులు గడిస్తే ఎండలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో ప్రజలు ఇప్పటికే కూలర్ లు ఏసీల కొనుగోలు మొదలుపెట్టారు. అయితే కొనుగోలు చేసేటప్పుడు ఏసీ మంచిదా….? కూలర్ మంచిదా అనే డౌట్ ప్రతిఒక్కరికీ ఉంటుంది. కాబట్టి రెండింటిలో ఏది మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం….ఏసీలు గదిలో ఉండే గాలిని లోపలికి తీసుకుని ఆ గాలిని చల్లబరిచి మళ్లీ బయటకు వదులుతాయి.
Advertisement
దాంతో ఆ గాలి పొడిగా ఉంటుంది. కానీ ఎయిర్ కూలర్ బయట నుండి వచ్చే గాలిని తీసుకుని చల్లగా వదులుతుంది. అంతే కాకుండా కూలర్ నుండి వచ్చే గాలి కూడా తేమగా ఉంటుంది. ఏసీలో క్లోరో ఫోరో కార్బన్, హైడ్రో క్లోరోఫ్లారో కార్బన్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి నష్టం కలిగించడమే కాకుండా వాతావరణానికి కూడా నష్టం కలిగిస్తాయి. రసాయనాల వల్ల ఓజోన్ పొర దెబ్బ తింటుంది.
Advertisement
ఓజోన్ పొరకు రంద్రం పడటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకే ప్రమాదం ఉంది. అలా జరిగితే చర్మవ్యాధులు అనేక రకాల వ్యాధులు వస్తాయి. అంతే కాకుండా ఏసీ వాడటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయ. కాబట్టి ఏసీ కంటే కూలర్ వందశాతం బెటర్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా ధర విషయంలోనూ ఏసీల కంటే కూలర్ ఎంతో బెటర్. ఏసీ ప్రారంభ ధర 20 వేల వరకూ ఉంటుంది. కానీ కూలర్ 5 వేలకే వస్తుంది. అంతే కాకుండా ఏసీ కంటే కూలర్ మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది.
ALSO READ :ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి