టాలీవుడ్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తరవాత వరుస ఆఫర్ లతో ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.
టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. కానీ ప్రేమలో బ్రేకప్ లు ఇతర పర్సనల్ కారణాల వల్ల ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. ఆ సమయంలోనే ఉదయ్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విషిత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తరవాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి బ్రేకప్ వరకూ అసలేం జరిగింది..!
Uday Kiran wife Vishihta
అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టడం ఫ్యామిలీ కారణాల వల్ల ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగిపోయాడు. దాంతో ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమాల గురించి ఎక్కువగా ఉదయ్ కిరణ్ బాధపడేవాడని…ఆషికి 2 సినిమాను ఎక్కువగా చూసేవాడని భర్త మరణం తరవాత విషిత చెబుతూ ఎంతో బాధపడింది.
Advertisement
అంతే కాకుండా విషిత ఉదయ్ కిరణ్ మరణం తరవాత అతడి కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యింది. కేవలం 13 రోజుల తరవాత విషిత తమ ఫ్యామిలీకి దూరంగా ఉండటం మొదలు పెట్టిందని ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఓ ఇంటర్య్వూలో తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం విషిత ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఉదయ్ కిరణ్ కు పోటీగా బన్నీతో సినిమా చేయాలనుకున్న తేజ..చివరికి ఏమైందంటే..!
ఇదివరకు ఉదయ్ కిరణ్ తో కలిసి హైదరాబాద్ లో ఉన్న విషిత భర్త మరణం తరవాత ముంబైకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని…ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండేవాడని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలను ఉదయ్ కిరణ్ సోదరి కొట్టివేసింది. ఉదయ్ కిరణ్ కు హైదరాబాద్ లో మియాపూర్ మరియు శంషాబాద్ వద్ద భూములు ఉన్నాయని తెలిపింది.
Also Read: Uday Kiran: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్ అందులో ఏముందంటే ?