Home » సుధీర్ తో నిశ్చితార్థం జ‌రిగిన అమ్మాయి ఎవ‌రు…బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

సుధీర్ తో నిశ్చితార్థం జ‌రిగిన అమ్మాయి ఎవ‌రు…బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by AJAY
Published: Last Updated on
Ad

టీవీ షోలు ఫ్యామిలీ ఫంక్ష‌న్ ల‌ను త‌ల‌పిస్తున్నాయి. బ‌ర్త్ డే లు మొద‌లుకుని అన్ని ఫంక్ష‌న్ ల‌ను చేసేస్తున్నారు. ఇటీవ‌ల ఏకంగా ఓ టీవీ షోలో సారీ ఫంక్ష‌న్ కూడా చేశారు. ఇక ఎంగేజ్మెంట్ లు ల‌వ్ ప్ర‌పోజ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ ఛాన‌ల్ ఈ ఛాన‌ల్ అని తేడా లేకుండా అన్ని ఛాన‌ల్స్ లోనూ ఫంక్ష‌న్ ల హ‌డావుడి క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ లు చేసి బుల్లితెర స్టార్ లు ముచ్చ‌ట ప‌డ‌టం. ఆ ఎపిసోడ్ చూసి ఆడియ‌న్స్ కూడా సంబుర‌ప‌డిపోతున్నారు.

Also Read: అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

Advertisement

ఇక రేటింగ్ లు ఎక్కువ రావ‌డంతో అన్ని ఛానల్స్ అదే ఫార్ములాను పాటిస్తున్నాయి. ఇదిలా ఉంటే అందులో కొన్ని ఫేక్ ఫంక్ష‌న్ లు కూడా ఉండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇక తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సుధీర్ తేజ‌స్వి నాయుడుల‌కు ఎంగేజ్మెంట్ చేశారు. తేజ‌స్వి నాయుడు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీతోనే పాపులారిటీ సంపాదించుకుంది.

Also Read: ప‌వ‌న్ ఫ్యాన్స్ త్రివిక్ర‌మ్ ను తిట్టడం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్..?

Advertisement

ఈ షోలో కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేశారు. దాంతో ఈ ప్రోమో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే నిజానికి తేజ‌స్వి నాయుడు గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ తాజాగా విడుద‌లైన ప్రోమోతో మాత్రం తెగ పాపులారిటీ సంపాదించుకుంది.

దాంతో అస‌లు తేజ‌స్వి ఎవరా అని చాలా మంది గూగుల్ చేస్తున్నారు. తేజ‌స్వి నాయుడు మోడ‌ల్ గా కెరీర్ ను ప్రారంభించి యాక్టింప్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది. అంత‌క‌ముందు కొన్ని వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టించి ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే గ‌తంలో సుధీర్ ర‌ష్మిల‌కు ఏకంగా స్టేజిపై పెళ్లి చేశారు. కానీ అది ఉత్తిత్తి పెళ్లి అని ఆ త‌ర‌వాత క్లారిటీ వ‌చ్చింది. ఇక ఇప్పుడు సుధీర్ తేజ‌స్విల‌ది నిజ‌మైన నిశ్చితార్థ‌మా లేదంటే ఇది కూడా రేటింగ్ కోసమేనా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Also Read: PRABHAS త్వ‌ర‌లో బాహుబ‌లి-3….క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్ ..!

Visitors Are Also Reading